E-PAPER

+91 92480 61999

దేశవ్యాప్తంగా కోర్టుల్లో విచారణ సాగుతున్న కేసులపై మీడియా సమాంతరంగా విచారణలు

దేశవ్యాప్తంగా కోర్టుల్లో విచారణ సాగుతున్న కేసులపై మీడియా సమాంతరంగా విచారణలు నిర్వహించడంపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో సాగే పక్షపాత రిపోర్టింగ్ వల్ల సదరు నిందితుడు నేరం చేశాడనే అనుమానాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

వీటిని అడ్డుకునేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్రాల డీజీపీలు, జాతీయ హక్కుల కమిషన్ కూడా నెలరోజుల్లో సూచనలు ఇవ్వాలంది.

మీడియాలో సాగే విచారణల వల్ల కోర్టుల్లో సాగే న్యాయవిచారణ ప్రభావితమవుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో పోలీసు సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలన్నారు.ఏ దశలో దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయాలో వారు నిర్ణయించుకోవాలని తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య అని,ఎందుకంటే ఇది బాధితుల, నిందితుల ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని తెలిపారు. అలాగే ప్రజాప్రయోజనాలను కూడా కలిగి ఉంటుందన్నారు.

ప్రాథమిక స్థాయిలో ఆలోచనలు, వార్తలను చిత్రీకరించడానికి, ప్రసారం చేయడానికి మీడియాకు ఉన్న హక్కు రెండింటిలోనూ ప్రసంగం, భావవ్యక్తీకరణ యొక్క ప్రాథమిక హక్కుతో నేరుగా ప్రమేయం కలిగి ఉందని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. కానీ మనం ‘మీడియా విచారణ’ని అనుమతించకూడదన్నారు. ప్రజలకు చర్చించే హక్కు ఉన్నా, విచారణ సమయంలో ముఖ్యమైన సాక్ష్యాలు వెల్లడైతే, దర్యాప్తును కూడా ప్రభావితం చేయవచ్చని తెలిపారు.

ఇదే అంశంపై 2017 నాటి సూచనలకు సంబంధించిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారిస్తోంది. నిందితులు, బాధితురాలి హక్కులను దృష్టిలో ఉంచుకుని పోలీసు బ్రీఫింగ్‌ల కోసం నిబంధనలను రూపొందించాలని, ఇరుపక్షాల వారు ఏ విధంగానూ పక్షపాతం లేదా ఉల్లంఘించకుండా చూసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ముసాయిదా నివేదికను సమర్పించేందుకు కేంద్రానికి కోర్టు ఆరు వారాల గడువు ఇచ్చింది.

ఏపీలో ప్రస్తుతం విపక్ష నేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై పలు జాతీయ మీడియా ఛానళ్లతో పాటు రాష్ట్రంలోని ప్రాంతీయ మీడియా ఛానళ్లలోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు తప్పుచేశారని కొందరు, చేయలేదని మరికొందరు తమ వంతు విచారణలు నిర్వహించేస్తున్నారు. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు చంద్రబాబు ఎపిసోడ్ లో మీడియా పనితీరుకు అద్దం పట్టేలా ఉన్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !