E-PAPER

+91 92480 61999

మొదలైన ప్రజావాణి, తరలివచ్చిన ప్రజలు..!

తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రం ఎన్నికల సంఘం ఎత్తివేసింది. దీంతో ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకోనున్నారు అధికారులు. దీనికి ఎలాంటి అంతరాయ లేకుండా తీసుకుంటామని చెబుతున్నారు ప్రజావాణి ఇన్ ఛార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి.

 

ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రజాభవన్‌లో మొదలైంది. ప్రతీవారం మంగళవారం, శుక్రవారంలో నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారాయన. ముఖ్యమంగా ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా అందజేయాలని వివరించారు.

 

తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి మాంచి రెస్పాన్స్ ఉంది. ప్రజల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే చొరవ చూపాలని కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిణిగా మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !