E-PAPER

+91 92480 61999

ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి తుమ్మల..

హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. రెండు రోజులు జరగనున్న ఈ సదస్సులో భారత్‌తో పాటు 30 దేశాలు పాల్గొననున్నాయి. శాస్త్రవేత్తలు, రైల్ విుల్లర్ సంఘాల ప్రతినిధులతో పాటు 250 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్‌లో వరిసాగు, ఉత్పత్తి, నాణ్యత విదేశీ ఎగుమతుల పెంపుపై చర్చలు జరపనున్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని అన్నారు. ఇటీవలే దశాబ్ధి ఉత్సవాలు కూడా జరుపుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో రైస్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 1.2 ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు అనుకూల రాష్ట్రం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వ్యవసాయానికి అనుకూలంగా అన్ని రకాలుగా రైతులకు మద్దతు ఇస్తుందని వెల్లడించారు. రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సేకరిస్తుందని అన్నారు. వివిధ పథకాల క్రింద పౌష్టికాహారం కోసం పోర్టిఫికేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.

 

రాష్ట్రంలో 3 వేల అత్యాధునిక రైస్ మిల్లులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో నీటి పారుదల వనరులు కూడా పెరుగుతున్నాయని వెల్లడించారు. ఇన్‌పుట్ సబ్సిడీ, నాణ్యమైన విత్తనాలతో పాటు ఎరువులను అందించడంతో పాటు ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామని అన్నారు. దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. తమ సర్కార్ వ్యవసాయానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !