E-PAPER

+91 92480 61999

శర్వా మరో కొత్త సినిమా అప్డేట్..!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా ‘మనమే’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో శర్వానంద్ యాక్టింగ్ చాలా బాగుందని అంటున్నారు. అయితే అక్కడక్కడ కాస్త బోరింగ్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడు పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

 

ఇక ఈ మూవీ శర్వా కెరీర్‌లో 35వ సినిమాగా తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఇప్పుడు శర్వా నటించబోతున్న మరోక సినిమా గురించి అదిరే అప్డేట్‌ను మేకర్స్ అందించారు. శర్వా కెరీర్‌లో 37వ సినిమాగా ఓ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రానికి ‘సామజవరగమన’ ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీ అత్యంత గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరలో అవుతోంది. దర్శకుడు రామ్ అబ్బరాజు సోషల్ మీడియా ద్వారా ఓ అప్డేట్ అందించాడు. ‘ప్రేమ.. నవ్వు కలయికను ఇంతకముందెన్నడూ లేని విధంగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి.. అద్భుతమైన ఫన్ రైడ్’ అంటూ ఈ మూవీ షూటింగ్ స్టిల్స్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ స్టిల్స్ చూసి శర్వా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

 

కాగా ఈ మూవీ షూటింగ్ నిన్న అంటే జూన్ 6న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శర్వానంద్, సంయుక్త ఇద్దరూ కీలక సన్నివేశాల షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీతో పాటు ‘శర్వా 36’ మూవీ కూడా గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అందాల ముద్దుగుమ్మ మాళవికా నాయర్ ఈ మూవీలో శర్వాకు జోడీగా హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. ఆ మధ్య ఈ మూవీ స్టిల్స్ కూడా రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఏది ఏమైనా శర్వానంద్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం.. విజయపజయాలతో సంబంధం లేకుండా పలు సినిమాతో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !