E-PAPER

+91 92480 61999

నాంపల్లి కోర్టు మెట్లెక్కిన ఏజెంట్ వివాదం.. భోళా శంకర్ నిర్మాతలపై క్రిమినల్ కేసు!

యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ వ్యవహారం నిర్మాతలను, డిస్టిబ్యూటర్లను ఇంకా వెంటాడుతున్నది. ఆ సినిమా నష్టాల వివాదం కేవలం ఏజెంట్‌కు మాత్రమే పరిమితం కాకుండా భోళా శంకర్ సినిమాకు పాయింది.

తాజాగా భోళా శంకర్ సినిమా నిర్మాతలపై డిస్టిబ్యూటర్లు కోర్టులో కేసు నమోదు చేశారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల వ్యవహారంలో నిర్మాతలు చీటీంగ్ చేశారని డిస్డిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్) వెల్లడించారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారు. ఆ సినిమా నైజాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు బ్యాంక్ ద్వారా చెల్లించాను. అయితే చివరి నిమిషంలో కేవలం వైజాగ్ హక్కులు మాత్రమే నాకు కేటాయించారు. ఆత ర్వాత నిర్మాతలను సంప్రదిస్తే.. భోళా శంకర్ సినిమా రిలీజ్‌కు ముందు డబ్బు తిరిగి ఇస్తాం అని చెప్పారు. ఆ మేరకు అండర్ స్టాండింగ్ లెటర్ కూడా ఇచ్చారని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు.

గత 13 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాను. రంగస్థలం లాంటి భారీ సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాను. అఖిల్ సినిమా విషయంలో నాకు తీవ్ర అన్యాయం జరిగింది. డబ్బు చెల్లించకపోగా మాట్లాడటానికి కూడా నిరాకరించారు. ఆ క్రమంలో కోర్టును ఆశ్రయించగా, పటిషన్ దాకలు చేసుకోమని చెప్పారు. దాంతో న్యాయపోరాటం చేసేందుకు రెడీ అయ్యాను అని సతీష్ చెప్పారు. ఈ క్రమంలో నాంపల్లి క్రిమినల్ కోర్టులో నిర్మాతలపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశాం అని తెలిపారు.

బత్తుల సత్యనారాయణ (సతీష్) తరఫు న్యాయవాది కేశాపురం సుధాకర్ మాట్లాడుతూ.. ఏజెంట్ నిర్మాత చీటింగ్ చేశారనే కేసులో కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సతీస్‌కు జరిగిన అన్యాయానికి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తాం. నిర్మాతలపై రికవరీ సూట్ ఫైల్ చేశాం. నాంపల్లి క్రిమినల్ కోర్టులో సతీష్ ను మోసం చేసిన భోళా శంకర్ నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, ఇంకా వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్ పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం,వంటి వివిధ సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ చేశాం అని తెలిపారు.

ఏజెంట్ హక్కుల వివాదంపై సతీష్‌కు నిర్మాత నట్టి కుమార్ అండగా నిలిచారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. వారిని ఇటీవల మోసం చేయడం ఓ అలవాటుగా మారింది. బాధితులకు న్యాయం చేయాల్సిన నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్లు మోసగాళ్లకే సహాయం చేస్తున్నాయి. ఇలాంటి విషయాలు చాలా బాధ కలిగిస్తున్నది. సతీష్‌కు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం అని నట్టి కుమార్ చెప్పారు. ఐటీ, జీఎస్టీ కట్టకుండా మోసం చేస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది.వాటిపై కూడా సంబంధిత విభాగాలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !