E-PAPER

+91 92480 61999

కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ ఘన విజయం..

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు జరిగిన సికింద్రాబాద్కంటోన్మెంట్శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్అభ్యర్థి శ్రీగణేశ్ భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టినట్లయింది. బీఆర్ఎస్ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

 

ఈ ఎన్నికలో బీఆర్ఎస్తరఫున లాస్య నందిత సోదరి నివేదిత, బీజేపీ అభ్యర్థిగా టీఎన్వంశ తిలక్సహా 15 మంది పోటీలో నిలిచారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మే 13వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. అందులో 2,53,706 మంది ఓటర్లు ఉంటే.. 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 47.85 శాతం ఓట్లు పోలవగా, ఈసారి 51.61 శాతం నమోదైంది.

 

మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి పోస్టల్బ్యాలెట్ఓట్ల లెెక్కింపుతో ప్రక్రియ మొదలైంది. అనంతరం పలు రౌండ్లలో జరిగిన లెక్కింపులో చివరగా కాంగ్రెస్అభ్యర్థి శ్రీగణేశ్ విజేతగా నిలిచారు.

 

కాగా, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని నెలలకే రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మళ్లీ ఆ పార్టీ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలవగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన శ్రీగణేశ్ ఈ సారి కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.

 

బీజేపీ తరఫున వంశతిలక్‌ పోటీ చేశారు. అయితే, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాలేదు. దీంతో కంటోన్మెంట్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విస్తృతంగా ప్రచారం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !