E-PAPER

+91 92480 61999

బర్డ్‌ ఫ్లూతో ప్రపంచంలో తొలి మరణం..!

ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం మెక్సికో దేశంలో సంభవించింది. హెచ్5ఎన్2 బర్డ్ ఫ్లూ వేరియంట్ బారిన పడ్డ స్థానికుడు ఒకరు (25) ఇటీవల మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, విరేచనాలు, కడుపులో తిప్పడం తదితర సమస్యలతో బాధపడ్డ రోగి ఏప్రిల్ 24న కన్నుమూశాడు. బాధితుడు బర్డ్ ఫ్లూ బారిన పడ్డ విషయాన్ని మెక్సికో అధికారులు మే 23న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు.

 

రోగికి వ్యాధి ఎలా సోకిందనే దానిపై సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, మెక్సికోలోని కోళ్లల్లో హెచ్5ఎన్2 ఇన్ఫెక్షన్లు వెలుగు చూసినట్టు పేర్కొంది. మరి, కోళ్ల నుంచి మనిషికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో నిర్ధారించడం కష్టంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇప్పటివరకూ ఈ వేరియంట్ మనుషులకు సోకడం దాదాపు అసాధ్యంగా భావించినట్టు పేర్కొంది.

 

మరోవైపు, అమెరికాలో బర్డ్ ఫ్లూకు చెందిన మరో వేరియంట్ వ్యాపిస్తోంది. పశువుల్లో ఈ వ్యాధి ప్రబలుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. కొందరు మనుషులు కూడా దీని బారినపడ్డట్టు తెలుస్తోంది. అయితే, ఇది రోగుల నుంచి ఇతరులకు వ్యాపిస్తోందనేందుకు ఇంతవరకూ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !