E-PAPER

+91 92480 61999

‘కాంచ‌న 4’ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..!

కోలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ అయిన ఫ్రాంచైజ్‌లలో ‘కాంచ‌న’ ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ చిత్రాలు భారీ హిట్‌గా నిలిచాయి. హారర్, కామెడీ జానర్‌లో వచ్చిన ముని, కాంచ‌న 2, కాంచ‌న 3 చిత్రాలు ఓ ట్రెండ్‌ని సెట్ చేశాయి. ఈ ఫ్రాంచైజ్‌లో కొత్త సీక్వెల్ ఉన్నట్టు రాఘవ లారెన్స్ హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

 

కాంచ‌న 4ను డైరెక్టర్ రాఘవ లారెన్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. రాఘ‌వ లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న కాంచ‌న 4 సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో ప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2025 స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాఘ‌వ లారెన్స్, కోవై సరళల కామెడీ ఈ సినిమాలల్లో అందరిని అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలలో వేదిక, నిత్యా మీనన్, తాప్సీ పన్నులు కథానాయికలుగా నటించారు. కాంచ‌న 4లో వేదికను తీసుకుంటారా? లేదా మరో హీరోయిన్ ఉంటుందో చూడాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !