E-PAPER

+91 92480 61999

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ శాతం వివరాలను ప్రకటించిన ఈసీ..

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నమోదైన పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 72.44 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని తెలిపింది. నియోజకవర్గ వ్యాప్తంగా 4,63,839 ఓట్లకు గాను 3,36,013 ఓట్లు పోలయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ హరిచందన తెలిపారు.

 

2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 76.35 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే, గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. జూన్ 5న నల్లగొండలో ఓట్ల లెక్కింపు జరగనున్నది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరఫున రాకేశ్ రెడ్డి, బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్న విషయం విధితమే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !