E-PAPER

+91 92480 61999

కేసీఆర్‌కు వాళ్లను కవిత ముందే పరిచయం చేసింది: ఈడీ..

ఢిల్లీ మద్యం విధానం కేసు విషమై ఈడీ తాజాగా పలు విషయాలను బయటపెట్టింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్న సందర్భంగా ఈడీ సంచలన విషయాలను కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కామ్ గురించి ముందుగానే కవిత, కేసీఆర్ కు చెప్పిందని ఈడీ పేర్కొన్నది. ఆ సమయంలో ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో తన బృందంలోని సభ్యులైనటువంటి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్ పిళ్లైను కవిత.. కేసీఆర్ కు పరిచయం చేసిందని ఈడీ తెలిపింది. అనంతరం వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని, కేసీఆర్ కు సమీర్ మహేంద్రును బుచ్చిబాబు పరిచయం చేశారని ఈడీ వెల్లడించింది.

 

‘అయితే, కేసీఆర్ తో భేటీ అయిన వివరాలకు సంబంధించి గోపీ కుమరన్ వాంగ్మూలంలో రికార్డు చేశారు. కవిత రెండేళ్లలో సుమారు 11 సెల్ ఫోన్లు వాడారు. అందులో నాలుగు ఫోన్లలో ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు’ అని ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !