E-PAPER

+91 92480 61999

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం..!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల ఎంట్రీపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. నిబంధ‌న‌ల మేర‌కే సోమ్ డిస్టిలరీస్ కంప‌నీ త‌మ ఉత్ప‌త్తుల‌ను స‌ర‌ఫరా చేసేందుకు తెలంగాణ బేవ‌రేజ్ కార్పోరేష‌న్‌ అనుమ‌తినిచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

 

కొత్త మ‌ద్యం బ్రాండ్లకు సంబంధించి త‌మ వ‌ద్ద‌కు ఎటువంటి ద‌ర‌ఖాస్తులు రాలేవ‌ని గ‌తంలో ఓ ప్రెస్ మీట్ సంద‌ర్భంగా తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ఆ ఫైల్ త‌న వ‌ద్ద‌కు రాలేద‌ని, ఇప్పుడు ఉన్న ప్రోసీజ‌ర్ ప్ర‌కార‌మే నిర్ణ‌యాలు తీసుకునే అధికారం బెవ‌రేజ్ కార్పోరేష‌న్ కు ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే సోమ్ డిస్టిల‌రీస్‌కు త‌మ ఉత్ప‌త్తుల స‌ర‌ఫ‌రాకు అమ‌మ‌తినిచ్చార‌ని మంత్రి తెలిపారు.

 

తెలంగాణ బేవ‌రేజ్ కార్పోరేష‌న్ రోజువారీ కార్య‌క‌లాపాలు త‌మ దృష్టికి రావ‌న్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. వాస్త‌వ‌వాల‌ను తెలుసుకోకుండానే కొన్ని ప‌త్రిక‌లు అస‌త్య వార్త‌ల‌ను ప్రచురించాయ‌న్నారు. రాష్ట్రంలో హోల్‌సేల్ మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు కొత్త బ్రాండ్లకు అనుమ‌తులు ఇచ్చే ప్ర‌క్రియ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ప‌రిధిలో ఉంటుంద‌న్నారు.

 

డిమాండ్- స‌ప్ల‌య్‌ను బ‌ట్టి కొత్త కంపెనీల‌కు అనుమ‌తులు మంజూరు చేస్తుంద‌ని మంత్రి ఒక ప్ర‌కట‌న‌లో పేర్కొన్నారు. రెండు ద‌శాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ త‌మ ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తుంద‌ని.. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఐఎంఎఫ్ఎల్ సరఫరాదారుగా ఉందని చెప్పారు. ఇప్ప‌టికే ఉన్న‌ ఎక్సైజ్ పాల‌సీ ప్ర‌కార‌మే బెవ‌రేజ్ కార్పోరేష‌న్ లిమిటెడ్ ఎండీ.. సామ్ డిస్టిలరీస్ తో పాటు ఇత‌ర కంపెనీల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు అనుమ‌తులిచ్చార‌ని తెలిపారు. ఎక్క‌డా కూడా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని మంత్రి తేల్చి చెప్పారు.

 

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హాయంలో నాలుగు సంవత్స‌రాల క్రితం కొత్త బ్రాండ్ల‌కు అనుమ‌తులు ఇచ్చిన విష‌యాన్ని మంత్రి జూపల్లి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. 2020-2021 సంవ‌త్స‌రంలో 50 లిక్క‌ర్ బ్రాండ్లు, 5 బీర్ బ్రాండ్ల కంపెనీల‌కు, 2021-2022లో 75 లిక్క‌ర్ బ్రాండ్లు, 8 బీర్ బ్రాండ్ల కంపెనీల‌కు, 2022-2023లో 122 లిక్క‌ర్ బ్రాండ్లు, 11 బీర్ బ్రాండ్ల కంపెనీల‌కు, 2023-2024లో 41 లిక్క‌ర్ బ్రాండ్లు, 9 బీర్ బ్రాండ్ల కంపెనీల‌కు అనుమ‌తులు ఇచ్చిందని వివరించారు. గ‌తంలో కూడా బెవ‌రేజ్ కార్పోరేష‌న్ లిమిటెడ్ కొత్తగా మ‌ద్యం కంపెనీల‌కు ఇలానే అనుమ‌తులు ఇచ్చింద‌ని, ఆ ప్రోసీజ‌ర్ ప్ర‌కార‌మే తాము అప్రూవ‌ల్ ఇచ్చామ‌న్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !