E-PAPER

+91 92480 61999

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇవాళ కీలక మలుపు చోటు చేసుకుంది. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్లపై జరుగుతున్న విచారణలో భాగంగా తొలిసారి ఈ కేసులో ఆమె తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు బయటికి వచ్చింది. ఈ మేరకు ఈడీ తొలిసారి కేసీఆర్ పేరును ఇవాళ ఢిల్లీ హైకోర్టులో ప్రస్తావించింది.

ఢిల్లీ మద్యం స్కాంలో నిందితురాలిగా ఉన్న కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయి. ఇందులో లిక్కర్ స్కాంలో ఆమె తండ్రి కేసీఆర్ పాత్రపై ఈడీ వివరించింది. లిక్కర్‌ స్కాం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్‌ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్‌కు కవిత ముందే వివరాలు చెప్పినట్లు ఈడీ వెల్లడించింది.

 

ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే కవిత సౌత్ లాబీతో లిక్కర్ స్కాంపై చర్చలు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఈ మేరకు తన టీం సభ్యులను ఢిల్లీలో కేసీఆర్‌కు ఆయన అధికారిక నివాసంలో కవిత పరిచయం చేశారని ఈడీ పేర్కొంది. కవిత పరిచయం చేసిన వారి నుంచి మద్యం వ్యాపారం వివరాలను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారని తెలిపింది. దీంతో తదుపరి దర్యాప్తులో కేసీఆర్ ను ఈడీ విచారిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !