E-PAPER

+91 92480 61999

కౌంటింగ్ డేపై అధికారులకు ఈసీ తాజా హెచ్చరికలు..!

ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో భారీ ఎత్తున హింస చెలరేగింది. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావం ఉండే పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చాలా కాలం తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని ముందుగా ఊహించడంలో విఫలమైన అధికారులపై ఇప్పటికే వేటు వేసిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు కౌంటింగ్ సందర్బంగా అవి పునరావృతం కాకుండా ఉండేలా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది.

 

రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా పల్నాడుతో పాటు రాయలసీమలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసారి కౌంటింగ్ కు ముందే బలగాల మోహరింపుతో పాటు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. రాష్ట్ర ఎన్నికల సంఘంతో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు ఇచ్చారు.

 

రాష్ట్రంలో కౌంటింగ్ సందర్భంగా కచ్చితమైన ఫలితాల ప్రకటనకు, అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు చేసిన ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కౌంటింగ్ నేపథ్యంలో హింస చోటు చేసుకుంటే జిల్లా ఎస్పీలను బాధ్యుల్ని చేస్తామని మరోసారి హెచ్చరించారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతున్న నేపథ్యంలో ఈసీ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరింంచుకున్నాయి

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !