E-PAPER

+91 92480 61999

వైసీపీకి బీజేపీ టెన్షన్..!

ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. గెలుపు పైన భిన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గాల వారీగా ఓటింగ్ సరళి పై కసరత్తు చేసి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ కోసం సిద్దమవుతున్నాయి. ఈ సమయంలో ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల పైన ఆసక్తి కర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ధర్మవరం లో వైసీపీ వర్సస్ బీజీపీ పోరు కీలకంగా మారుతోంది.

 

హోరా హోరీ పోరు ధర్మవరంలో ఈ సారి ఎన్నికల పోరు హోరా హోరీగా సాగింది. తొలుత ఈ సీటు బీజేపీకి ఇవ్వటంతో వైసీపీకి గెలుపు సులువు అనే చర్చ జరిగింది. కానీ, కాల క్రమేణా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.1983 నుంచి ధర్మవరం నియోజకవర్గానికి జరిగిన 9ఎన్నికల్లో.. టిడిపి ఏడు సార్లు గెలిచింది. కాంగ్రెస్ నుంచి 2009లో గెలిచిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. తిరిగి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియాలో రాష్ర్ట వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కేతిరెడ్డి ఈ సారి మళ్లీ పోటీ చేశారు. ఇక్కడ సీటు బీజేపీ నుంచి వరదాపురం సూరి..టీడీపీ నుంచి పరిటాల శ్రీరాం మధ్య చివరి వరకు పోటీ కొనసాగింది. చివరకు బీజేపీ నుంచి సత్యకుమార్ పేరు ఖరారైంది.

 

వైసీపీ – బీజేపీ పోటా పోటీ సత్య కుమార్ వచ్చి రాగానే తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. కేతిరెడ్డిపై మోడీకా పరివార్ యుద్ధం ప్రకటించింది అంటూ.. ప్రజల్లోకి వెళ్లారు. అందర్నీ కలుపుకుని పోతూ వ్యూహాత్మకంగా ప్రచారం చేశారు. సత్యకుమార్ కోసం పరిటాల శ్రీరామ్ కష్టపడటం ఆయనకు కలిసి వచ్చింది. పరిటాల వర్గం సపోర్టుతో సత్యకుమార్ ధర్మవరం ప్రచారం కొనసాగించారు. ధర్మవరంలో ముఖ్యంగా చేనేతలు, కురుబలు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉంటారు. దీంతో సత్యకుమార్ బీసీ కార్డ్ ని బాగా ఉపయోగించుకున్నారు. ఇంతవరకు ధర్మవరంలో ఏ ఒక్క ప్రధాన పార్టీ బీసీ అభ్యర్థికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. దాన్ని ఫోకస్ చేస్తూ సత్యకుమార్ బీసీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు.

 

విజయం దక్కేదెవరికి సత్యకుమార్ కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారం చేసారు. ధర్మవరం వేదికపై సత్య కుమార్ తనకు అత్యంత ఆప్తుడంటూ ఆకాశానికి ఎత్తారు. అమిత్ షా మాత్రమే కాకుండా హీరోయిన్ నమిత, హీరో సాయి కుమార్‌లు సత్యకుమర్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. అంతే కాకుండా కేంద్ర మంత్రులను సైతం ప్రచారంలో కి దింపారు. అదే సమయంలో అప్పటికే క్షేత్ర స్థాయిలో కేతిరెడ్డి పూర్తిగా ప్రజల్లో ఉన్నారు. వ్యక్తిగతంగా ఉన్న పట్టు..ప్రభత్వ సంక్షేమం తనకు కలిసి వస్తుందని కేతిరెడ్డి ధీమాగా ఉన్నారు. అయితే, పోలింగ్ సరళి ఏకపక్షంగా లేదనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో..ఈ ఇద్దరిలో గెలుపు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ధర్మవరం లో కొనసాగుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !