E-PAPER

+91 92480 61999

తెలుగు రాష్ట్రాలకు తొలి వందే భారత్ స్లీపర్..!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆక్యెపెన్సీ రేషితో కొత్త సర్వీసులను ప్రారంభించాల ని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వందేభారత్ స్లీపర్ తొలి విడతలోనే సికింద్రాబాద్ – పూణే మధ్య అందుబాటులోకి రానుంది.

 

వందేభారత్ స్లీపర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రైళ్ల తొలి విడత ఖరారులో తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా నిర్ణయం జరిగింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నుంచి రైల్వే బోర్డు ప్రతిపాదనలు కోరింది. దీంతో..రద్దీ మార్గంగా ఉన్న సికింద్రాబాద్ – పూణే మార్గంలో కేటాయించాల్సిందిగా అధికారులు కోరారు. ఈ మార్గంలో ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ మార్గంలో వందేభారత్ స్లీపర్ కేటాయిస్తే ఆక్యెపెన్సీ పెరుగుతుందని అధికారులు నివేదిక ఇచ్చారు.

 

ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్న వారి సంఖ్యను అదికారులు వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్ – విశాఖ, విజయవాడ – చెన్నై, కాచిగూడ – యశ్వంత్ పూర్, సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైళ్లు వందశాతం ఆక్యెపెన్సీతో నడుస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ – పూణే మద్య వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే ప్రయాణీకులకు మరింత సమయం కలిసి రానుంది. వందేభారత్ రెగ్యులర్ రైలు కేటాయించాలని గతంలోనే భావించినా..దూరం ప్రయాణం కావటంతో స్లీపర్ వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. ఇప్పుడు వందేభారత్ స్లీపర్ తొలి విడత కేటాయింపులోనూ ఈ రైలు అందుబాటులోకి రానుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !