E-PAPER

+91 92480 61999

సచివాలయంలో మంత్రుల ఛాంబర్ల ఖాళీ-జీఏడీ జూన్ 3 డెడ్ లైన్..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందులో భాగంగా సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంత్రులకు సర్కులర్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. జీఏడీ ఆదేశాల ప్రకారం మంత్రులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

 

రాష్ట్రంలో వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది కాబట్టి ఆలోపు అంటే జూన్ 3 కల్లా మంత్రులు రాష్ట్ర సచివాలయంలోని తమ ఛాంబర్లు ఖాళీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త మంత్రుల కోసం వీటిని సిద్దం చేయాల్సి ఉంటుంది కాబట్టి జూన్ 3లోపు ఖాళీ చేసి తమకు అప్పగించాలని కోరింది. ఆలోపు మంత్రులు, వారి సిబ్బంది వారికి సంబంధించిన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని తీసుకెళ్లేందుకు అనుమతించనుంది.

 

జూన్ 3 కల్లా తమకు సంబంధించిన వస్తువులను ఛాంబర్ల నుంచి తీసుకెళ్లేందుకు మంత్రులు, వారి సిబ్బందికి అనుమతిస్తారు. ఈ సమయంలో ఇతర వస్తువులు తీసుకెళ్లేందుకు వీలు ఉండదు. ఈ మేరకు వాహనాల తనిఖీలు నిర్వహించేలా సచివాయ భద్రత చూస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. జూన్ 3 కల్లా సచివాలయంలో ఛాంబర్లన్నీ ఖాళీ అయితే అదే రోజు వాటికి తాళాలు వేస్తారు. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటు లోగా వాటిని కొత్త మంత్రుల కోసం సిద్ధం చేస్తారు. మంత్రివర్ణ ప్రమాణస్వీకారం తర్వాత వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయింపులు చేస్తారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !