E-PAPER

+91 92480 61999

అమరావతి ఊపిరి పీల్చుకో – చంద్రబాబు కీలక నిర్ణయం..!

ఏపీలో రాజధాని అంశం పై కీలక నిర్ణయం జరగనుంది. ఏపీలో ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. చంద్రబాబు సారధ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 9న కొలువు తీరనుంది. వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధాని గా అమరావతి కొనసాగింపుకు కట్టుబడి ఉన్నాయి. ఎన్నికల్లో అటు విశాఖ..ఇటు అమరావతి పరిధిలో ప్రజలు వైసీపీని ఓడించారు. ఫలితంగా అమరాతికి ఆమోదం తెలిపారు. దీంతో..బాధ్యతల స్వీకరణ తరువాత అమరావతి కోసం చంద్రబాబు కీలక నిర్ణయానికి రంగం సిద్దం అవుతోంది.

 

అమరావతి పై నిర్ణయం ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని వివాదం మొదలైంది. చంద్రబాబు అమరావతిని రాజధానిగా అయిదేళ్ల కాలంలో కొనసాగించారు. జగన్ 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేస్తూ పరిపాలనా రాజధానిగా విశాఖ..న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. శాసనసభలో తీర్మానం చేసారు. అమరావతి వాసులు హైకోర్టును ఆశ్రయించటంతో అక్కడ తీర్పుకు ముందు జగన్ అసెంబ్లీలో తన తీర్మానాలను ఉపసంహరించుకున్నారు. హైకోర్టు అమరావతికి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీని పైన ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

 

చంద్రబాబు కసరత్తు సుప్రీంకోర్టులో దాదాపు ఏడాదిన్నార కాలంలో రాజధాని వ్యవహారం విచారణలో ఉంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసంగా లేదని..రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని నాటి ప్రభుత్వం సుప్రీంలో పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానూ కాల పరిమితి ముగిసింది. ఇక, ఇప్పుడు ఏపీలో వైసీపీ ఓడి..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం డీఎస్సీ ఉద్యోగాల భర్తీ పైన ఉంటుందని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు.

 

అధికారికంగా ఆమోదం ఆ వెంటనే నూతన మంత్రివర్గంతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అందులో అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన చేసిన అప్పీల్ ను ఉపసంహరించుకొనేలా న్యాయ పరమైన అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీంలో కేసు ఉపసంహరణ తరువాత అసెంబ్లీలో రాజధాని పైన తీర్మానం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన న్యాయసలహాల మేరకు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకొని.. అమరావతి రాజధానిగా అధికార ప్రక్రియ పూర్తి చేసేలా సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !