E-PAPER

+91 92480 61999

వైసీపీ ఓటమికి సంచలన కారణాలు..!

ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీకి పరాభవం తప్పలేదు. వైసీపీ ఓటమి పైన అనేక విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి. రాజకీయంగా పలు కారణాల పైన చర్చ జరుగుతోంది. కూటమి గెలుపులో పవన్ పాత్ర పైన ప్రశంసలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఓటమి పైన వైసీపీ అంతర్మధనం మొదలు పెట్టంది. అయితే, ఆసక్తి కరంగా జగన్ సొంత మీడియా వైసీపీ ఓటమి గురించి కీలక అంశాలను విశ్లేషించింది.

 

ఓటమి పై అంతర్మధనం వైసీపీ ఓటమి కంటే వచ్చిన స్థానాల పైన ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ ఓటమికి కారణాల పైన జగన్ మీడియా ఆసక్తి కర కధనాలను వెల్లడించింది. ప్రభుత్వ పథకాల్లో పార్టీ కార్యకర్తలను భాగస్వాములను చేయకుండా దూరంగా ఉండటం వలనే ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పార్టీ శ్రేణుల్లో స్తబ్దత నెలకొందని,వైసీపీ పరాజయానికి ఇది కూడా ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నట్లు వివరించారు. జగన్ ఎన్నికల్లో 2019లో గెలిచిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులం, మతం, వర్గం చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించారని చెప్పుకొచ్చారు.

 

కార్యకర్తలు స్తబ్దుగా ఈ క్రమంలోనే సంక్షేమ పథకాలలో వైసీపీ కార్యకర్తలకు భాగస్వామ్యం కల్పించలేని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయల ద్వారా అందించటం కోసం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసారని వివరించారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలతో తమకు భాగస్వామ్యం కల్పించకపోవటంతో వైసీపీ కార్యకర్తలు నైరాశ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ఏ ఎన్నికల్లో అయినా ప్రచారం నుంచి పోింగ్ కేంద్రాలకు పార్టీ సానుభూతి పరులను తరలించటం వరకూ కార్యకర్తలదే కీలక భూమిక ఉంటుంది. కానీ, వైసీపీ శ్రేణుల్లో స్తబ్దత నెలకొనటం వలన ఈ ఎన్నికల్లో ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన లేదు.

 

అంచనాలు తలకిందులు పోలింగ్ రోజున పార్టీ శ్రేణుల్లో నిరాసక్తత కొట్టిచ్చినట్లు కన్పించింది. పోలంగ్ కేంద్రాల వద్దకు సానుభూతి పరులను తరలించి, ఓట్లు వేయించటానికి కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వైసీపీ పరాజయానికి ఇదీ ఒక కారణమని రాజకీయల పరిశీలకులు పేర్కొంటున్నట్లుగా ఆ కధనంలో పేర్కొన్నారు. అయితే, పోలింగ్ ముగిసిన తరువాత ఐప్యాక్ ప్రతినిధుల సమావేశంలో జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లతో విజయం సాధిస్తామని ధీమాగా చెప్పుకొచ్చారు. కానీ, ఫలితం మాత్రం భారీ షాక్ వచ్చింది. 11 సీట్లకే వైసీపీ పరిమితం కావాల్సి వచ్చింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !